Welcome to Varadhi Donors Club

Note: To Read in English Click on Star mark

🙏అందరికీ నమస్కారం🙏

పంచభూతాలన్నీ ' సేవ' కోసమే ఉన్నాయి. మరి పంచభూతాత్మకమైన మానవ శరీరం మాత్రం సేవ కోసం కాదా? అంటే! అవుననే చెప్పాలి. " సేవ పరమో ధర్మః " అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అన్ని ధర్మాల లోకి 'సేవ ' ఉత్కృష్ట మైనది. సృష్టిలో ప్రతీ వస్తువు, ప్రతీ జీవి తెలిసో, తెలియకో సేవ చేస్తూనే ఉన్నాయి. ఇందుకు మానవుడు కూడా అతీతుడు కాడు.
అటువంటి సేవ ఒంటరిగా చేయవచ్చు. అలా కాకుండా ఇంకా విస్తృత స్ధాయిలో చేయాలంటే సేవా దృక్పధం కలిగిన కొందరు వ్యక్తులు కలిసి వివిధ రంగాలలో సేవా కార్యక్రమాలు చేయడానికి, అవసరాలలో ఉన్న వారిని ఆదుకోవటానికి, చేయూత ఇవ్వడానికి, మన ప్రకృతిని, సమాజాన్ని పరిరక్షించు కోవడానికి స్వచ్ఛంద సేవా సంస్థలను ఏర్పాటు చేసి, ఇలా ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా కార్యక్రమాలు నిర్వహించవచ్చు. స్వచ్ఛంద సేవా సంస్థలు ఏవిధమైన సేవా కార్యక్రమాలు నిర్వహించాలన్నా వాటికి ఆర్ధిక వనరులు, ప్రోత్సాహం ఎంతో అవసరం. ఈ లక్ష్య సాధన కోసమే " వారధి డోనర్స్ క్లబ్ " ను ప్రారంభించడం జరిగింది.


మన లక్ష్యం (Our Motto)

1) స్వచ్ఛంద సేవా సంస్థలకు మరియు స్వచ్ఛంద సేవకులకు వారధి డోనర్స్ క్లబ్ సభ్యుల నుండి విరాళాలు ఇప్పించడం.
2) విద్య, వైద్యం, వివాహం మొదలైన సందర్భాలలో వారధి డోనర్స్ క్లబ్ సభ్యులు వారి యొక్క ఆర్ధిక ఇబ్బందులను అధిగమించడానికి సభ్యుల మధ్య సహకార భావనతో సహాయం అందించడం.
వారధి డోనర్స్ క్లబ్ సభ్యుల ద్వారా, సభ్యుల కొరకు 3 రకాల సేవా కార్యక్రమాలు అందిస్తోంది.
1) వారధి డొనేషన్ ప్రోగ్రామ్: "వారధి డోనర్స్ క్లబ్ " స్వచ్ఛంద సేవా సంస్థలకు మరియు స్వచ్ఛంద సేవకులకు విరాళాలు ఇప్పించడం.
2) వారధి సపోర్ట్: " వారధి డోనర్స్ క్లబ్ " సభ్యులలో ఎవరికైనా విద్య, వైద్యం, విషయాలలో సహాయం అవసరం వచ్చినప్పుడు "వారధి సపోర్ట్ " ప్రోగ్రామ్ ద్వారా సభ్యుల నుండి విరాళాలు ఇప్పించడం.
3) వారధి ఈవెంట్స్ : వారధి డోనర్స్ క్లబ్ సభ్యుల కష్టాలలో ఆదు కోవటమే కాదు, శుభకార్యాలలో కూడా సభ్యులు పాలు పంచుకునేటట్లు చేయడం.


వారధి డోనర్స్ క్లబ్ విజన్ (Vision)

1) సేవ చేయాలనే ఆలోచన ఉన్న వారిని ఒక సంఘటిత శక్తి గా మార్చడం కోసం వారధి డోనర్స్ క్లబ్ లో సభ్యులు గా చేర్చుకోవడం.
2) సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్వచ్ఛంద సేవా సంస్థ లకు ఆర్ధిక వనరులు సమకూర్చటం కోసం వారధి డోనర్స్ క్లబ్ సభ్యులు ద్వారా డొనేషన్ లు ఇప్పించడం.
3) స్వచ్ఛంద సేవా సంస్థలు ఏవిధమైన సేవా కార్యక్రమాలు నిర్వహించాలన్న నిస్వార్థంగా పని చేసే స్వచ్ఛంద సేవకులు (వాలంటీర్లు) ఎంతో ముఖ్యం. వీరు కూడా ఆర్ధిక ఇబ్బందులు లేకుండా ఉన్నప్పుడు మాత్రమే సేవా కార్యక్రమాల్లో పాల్గొనగలరు. కాబట్టి స్వచ్ఛంద సేవకులకు (వాలంటీర్లు) వారధి డోనర్స్ క్లబ్ సభ్యులు ద్వారా డొనేషన్ లు ఇప్పించడం.
4) విరాళాలు ఇవ్వడం కూడా స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో భాగమే అవుతుంది. కాబట్టి డొనేషన్ లు ఇచ్చిన వారిని స్వచ్ఛంద సేవకుల (వాలంటీర్లు) జాబితాలోకి చేర్చబడును. ఈ స్వచ్ఛంద సేవకులకు వారధి డొనేషన్ ప్రోగ్రామ్ ద్వారా సభ్యులకు డొనేషన్ లు ఇప్పించడం.
5) సేవ చేసే వారికి కూడా ఇంకొకరి సహాయం అవసరం పడవచ్చు. అందులో ముఖ్యంగా విద్య, వైద్యం, వివాహం విషయాల లో వారధి డోనర్స్ క్లబ్ సభ్యులకు సహకారం కావలసి వచ్చినప్పుడు సభ్యుల మధ్య వారధి సపోర్ట్ మరియు వారధి ఈవెంట్స్ కార్యక్రమాలు ద్వారా సభ్యుల అవసరాలు తీర్చడానికి సహకరించడం.


వారధి డోనర్స్ క్లబ్ మిషన్ (Mission)

వారధి డోనర్స్ క్లబ్ నిర్వహించాలన్న లక్ష్యాలను చేరుకోవడానికి కార్యాచరణ:

1) సాధారణ సభ్యత్వం: సేవ చేయాలనే ఆలోచన, దానగుణం కల వ్యక్తులు ఎవ్వరైనా " వారధి డోనర్స్ క్లబ్ " లో ఉచితంగా సభ్యులు గా చేరవచ్చు. ఇందుకు క్రింది "మెంబర్ రిజిస్ట్రేషన్" బాక్స్ ను క్లిక్ చేసి వివరాలు సబ్ మిట్ చేయడం ద్వారా సాధారణ సభ్యులు కావచ్చు. ఇందుకు ఏవిధమైన రుసుము చెల్లించక్కర లేదు. ఈ సర్వీస్ లు పూర్తిగా ఉచితం.
2) డోనర్ మెంబర్: వారధి డోనర్స్ క్లబ్ లో సాధారణ సభ్యులు గా చేరిన వారు వారధి డొనేషన్ ప్రోగ్రామ్ లో నిర్ణయించిన విధంగా ఒక స్వచ్ఛంద సేవా సంస్థకు రూ,, 600/-( ఆరు వందలు) మరియు 5గురు స్వచ్ఛంద సేవకులకు రూ,,100/- ( వంద రూపాయలు) చొప్పున డొనేషన్ లు ఇచ్చిన వారు డోనర్ మెంబర్ అవుతారు.
3) వారధి వాలంటీర్ : " వారధి డోనర్స్ క్లబ్ " లో డోనర్ మెంబర్ అయిన వారు స్వచ్ఛంద సేవకులుగా డొనేషన్ లు స్వీకరించదలిచి రిక్వెస్ట్ సబ్ మిట్ చేస్తే వారధి వాలంటీర్ గా పరిగణించబడతారు.

వారధి సపోర్ట్:
వారధి డోనర్స్ క్లబ్ సభ్యుల మధ్య సహాయ సహకారాల కొరకు వారధి సపోర్ట్ ప్రోగ్రామ్ రూపొందించడం జరిగింది.

ఎవరి జీవితంలోనైనా ఎక్కువ మొత్తం లో డబ్బులు అవసరమయ్యే సందర్భాలు:

1) వైద్య పరమైన ఖర్చులు,
2) పిల్లల ఉన్నత చదువులకు అయ్యే ఖర్చులు వీటిని సమర్థవంతంగా నిర్వహించాలంటే ఎంతో ప్రణాళిక అవసరం. కానీ! కొన్ని సందర్భాలలో ఇవి తలకు మించిన భారం అవుతుంది. అటువంటి సందర్భంలోనే తోటి వారి సహకారం ఎంతో అవసరం. వీటిని తీర్చడానికే 'వారధి సపోర్ట్ ' అనే కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది.

సహాయం పొందటానికి అర్హతలు:

1) ఈ వారధి సపోర్ట్ లో సహాయం పొందటానికి డోనర్ మెంబర్ గా వారధి డొనేషన్ ప్రోగ్రామ్ లో రెండు సార్లు డొనేషన్ ఇచ్చి ఉండాలి.
2) వారధి సపోర్ట్ ద్వారా విద్య కొరకు సహాయం పొందాలంటే కోర్సు , ఫీజు వివరాలు తెలియ చేస్తే వారి అకౌంట్ వివరాలు ఆప్ లో అప్ డేట్ చేయబడును.
3) వారధి సపోర్ట్ ద్వారా వైద్యం కోసం సహాయం పొందటానికి హాస్పిటల్ కు అయ్యే ఖర్చుల వివరాలు తెలియ చేస్తే వారి అకౌంట్ వివరాలు ఆప్ లో అప్ డేట్ చేయబడును.

వారధి ఈవెంట్స్ :

1)కష్టాలలో ఆదుకోవటమే కాదు, శభకార్యాలలో కూడా పాలు పంచుకోవడం, ఆశీర్వదించడం కూడా మన సాంప్రదాయం.
2)అందుకే ఏ శుభకార్యమైనా మనం ఆశీర్వదించడంతో పాటు కానుకలు కూడా ఇస్తూ ఉంటాం.
3)ఈ సాంప్రదాయాన్ని వారధి డోనర్స్ క్లబ్ సభ్యుల కొరకు వారధి ఈవెంట్స్ అనే పేరుతో నిర్వహిస్తోంది.
4)ఇందులో భాగంగా సభ్యుల పిల్లల వివాహం సందర్భంగా వారి వివరాలు ఆప్ లో ఉంచబడును.

Note: వారధి సపోర్ట్ మరియు వారధి ఈవెంట్స్ ఈ రెండు కార్యక్రమాలు 2021 వ సంవత్సరం విజయదశమి నుండి ప్రారంభించబడును.

ప్రకృతి ధర్మం ఏమిటంటే!" ఎవరు ఏది ఇస్తారో! అదే కొన్ని వందల, వేల రెట్లు అయ్యి తిరిగి వస్తుంది". అది మంచి అయినా? చెడు అయినా?
అలాగే!ఇచ్చే వారికే తీసుకునే అర్హత ఉంటుంది".
ఉదాహరణకు ఒక మామిడి టెంక నాటితే, మామిడి చెట్టు మాత్రమే మొలకెత్తుతుంది. ఆ మామిడి చెట్టు కు కొన్ని వేల కాయలు కాస్తూనే వుంటాయి. అది కూడా మామిడి కాయలే వస్తాయి. వేరే ఏ కాయలు రావు. ఆ చెట్టు కాయలు కోసుకుందుకు ఆ వ్యక్తికి మాత్రమే అర్హత ఉంటుంది.
కాబట్టి!ఎవరైతే విరాళం ఇస్తారో, వారికే కొన్ని వేల రెట్లు విరాళం వస్తుంది. ఎవరు సహాయం చేస్తారో! వారికే సహాయం అందుతుంది. ఇది ప్రకృతి నియమం.
అందుకే! "వారధి డోనర్స్ క్లబ్" ద్వారా డొనేషన్ లు ఇద్దాం, ఇతరులకు సహాయం చేద్దాం మన ఉన్నతికి బాటలు వేసుకుందాం.
రండి చేయి చేయి కలుపుదాం,' సేవయే పరమో ధర్మః ' అని నిరూపిద్దాం!!



For more Queries please contact us: +91 8522 825 622

Privacy Policy